ArticlesNews

క్రిప్టో క్రైస్తవుల మోసాలు

192views

హిందువుల్ని ఎలాగైనా మతం మార్చేసి తమ దేవుడిని పూజించేలా చెయ్యాలని వందల ఏళ్ళుగా ఎడారి మతాలు కిందా మీదా పడుతున్నాయి. హిందువుల ఆలయాల్ని కూల్చేసి, సంస్కృతిని నాశనం చేసి, నరమేధాలు చేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చెయ్యాలని పెద్ద సంఖ్యలో ముస్లిం ఛాందసవాదులు ఒకవైపు గట్టి ప్రయత్నం చేస్తుంటే… భారత్‌ని క్రైస్తవ దేశంగా మార్చెయ్యాలని విదేశీ నిధుల ద్వారా మరో రూట్ మ్యాప్‌తో వ్యూహాలు పన్నుతున్నాయి పలు క్రైస్తవ మిషనరీ సంస్థలు. మా మతంలోకి వచ్చేసి మా దేవుడిని పూజిస్తే రోగాలు తగ్గిపోతాయని, ఉద్యోగాలు వస్తాయని, డబ్బులిస్తామని ఇంకేవేవో ఆశలు చూపి అమాయకులు, నిరుపేదలైన హిందువుల్ని మభ్యపెడుతున్నారు. చివరికి అడవులు, కొండ ప్రాంతాలును కూడా వదలడం లేదు. వనవాసులు హిందువులు కారంటూ గిరిజనులకు సైతం మాయమాటలు చెప్పి బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు, పెళ్ళిళ్లు చేసుకుని ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారు.
హిందువులను తమ మతంలోకి లాక్కోవడానికి ఇప్పుడు ఎడారి మతాలు కొత్త ఆయుధాలను ఎంచుకున్నాయి. అవి, ‘ప్రేమ’, ‘మంచితనం’. హిందూ బాలికలు, యువతులను వలలో వేసుకునేందుకు ముస్లిం యువకులు హిందూ పేర్లతో ప్రేమ నటించి, వంచించి ఎందరినో బలిగొన్న లవ్ జిహాద్ కేసులు వేలకు వేలుగా బయటపడుతున్నాయి. తాజాగా యూపీలో బయటపడిన చంగూర్ బాబా కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. వేల కోట్ల లవ్ జిహాద్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టిన ఇతను, హిందువులలో కులానికొక రేటు కట్టి లక్షలకు లక్షలు వెదజల్లుతూ వచ్చాడు. ఇక క్రైస్తవంలో చూస్తే, క్రిప్టో కన్వర్టెడ్ క్రైస్తవులు కుటుంబాలకు కుటుంబాలే రంగంలోకి దిగి పెళ్ళి పేరిట హిందూ యువతుల జీవితాలను కబళించడం జరుగుతోంది.

క్రిప్టో క్రైస్తవులు, సమాజం దృష్టిలో పైకి హైందవాన్ని పాటిస్తూ, హిందువుల పేర్లతోనే చెలామణీ అవుతూ వ్యక్తిగతంగా మాత్రం క్రైస్తవాన్ని ఆచరిస్తూ చర్చికి విధేయులుగా ఉంటారు. సామాజికంగా కలిగే లాభాలు, ప్రభుత్వ ప్రయోజనాలను వదులుకోవడానికి ఇష్టం లేక పైకి హిందువులుగా నటిస్తుంటారు. నిజమైన హిందువులను క్రైస్తవంలోకి లాగేందుకు పెళ్లిళ్ళ రూపంలో కుట్రలు చేస్తూ బతికేస్తుంటారు. ఇటీవల ఈ క్రిప్టో క్రైస్తవుల మోసానికి ఎందరో నిజమైన హిందువులు బలైపోయారు.

తాజాగా, మహారాష్ట్రలోని సాంగ్లి ప్రాంతంలో పేరున్న పశువైద్యుడు డాక్టర్ చంద్రకాంత్ లక్ష్మణ్ పాటిల్ కుటుంబం ఇలాగే క్రిప్టో క్రైస్తవుల మోసానికి గురైంది. ఈయన కుమార్తె రుతుజా రాజ్‌గేను కుప్వాడ్‌లోని ఒక ఇంటికి 2021లో కోడలిగా పంపారు. భారీగా కట్నం, బంగారు నగలు పెట్టారు. రుతుజా భర్త సుకుమార్ సురేష్ రాజ్‌గే, అత్తమామలు అల్కా సురేష్ రాజ్‌గే, సురేష్ రాజారామ్ రాజ్‌గే… అన్నీ హిందువుల పేర్లే, అత్తగారు చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని హిందూ ముత్తయిదువను తలపిస్తుంది. అయితే, పెళ్ళయిన నెల రోజుల తర్వాత వీరి అసలు రూపం బట్టబయలైంది. కోడలు రుతుజా హిందూ సంప్రదాయాలు వదిలేయాలని, చర్చిలో ప్రార్థనలకు రావాలని మానసికంగా, భౌతికంగా హింసించి వేధించారు. తర్వాత రెండు కుటుంబాల పెద్దల జోక్యంతో కాస్త సర్దుబాటు జరిగి రుతుజా గర్భవతి కూడా అయ్యింది. ఆ తర్వాత రుతుజ ఇంటికి క్రైస్తవ పాస్టర్లు వచ్చి వేధించడం మొదలుపెట్టారు. చివరికి గత నెల జూన్ 06, 2025న రుతుజ శవమై కనిపించింది. ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది…

ఇలాంటిదే బీహార్‌లోని జముయి జిల్లాలో ఝూ పోలిస్ స్టేషన్ పరిధిలోని బలియాదిహ్ గ్రామంలో జరిగింది. సోనాలి దేవి అనే మహిళ తన భర్తతో కలిసి మే 26న జాముయ్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కలసి తన మామ తర్ణి దాస్, అత్త సురుతి దేవి, బావమరిది కన్హయ్య దాస్ సహా ఆమె అత్తమామలు క్రైస్తవ మతంలోకి మారమని తనను నిరంతరం ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి అత్తింటి కుటుంబ సభ్యులందరూ దాదాపు దశాబ్దం క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. పైకి హిందువులుగా నటించి సోనాలిని కోడలిగా చేసుకున్నారు.

ఇలా క్రిప్టో క్రైస్తవుల వంచన, మోసపూరిత కుట్రలకు హిందూ కుటుంబాలెన్నో తీవ్ర వేదనకు గురవుతున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని బిచోలి గ్రామానికి చెందిన గిరిజన యువతి సంగీత గొప్ప తెగువను ప్రదర్శించింది. ఈమె కథ ఏమిటంటే, సంగీతకు ఏప్రిల్ 17, 2025న ఆశిష్‌తో గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. కాని అత్తింట్లో ఆమె అత్తగారు పూజ గదిలోకి తీసుకెళ్లినప్పుడు అక్కడ హిందూ దేవీదేవతలకు క్రైస్తవ ‘శిలువ’ ఉండటం చూసి షాక్‌కి గురైంది. పెళ్లికి ముందు అత్తింటి వారు తాము క్రైస్తవాన్ని ఆచరిస్తున్నట్లు ప్రకటించలేదు. సంగీత మాత్రం గట్టి పట్టుదలతో సనాతన ధర్మాన్ని వదిలే ప్రసక్తే లేదని వారితో తెగేసి చెప్పి, తన సొంత ఊరు బిచోలికి నడిచి వచ్చింది. మతం దాచి పెళ్లి చేసుకున్న సంగీత భర్త ఆశిష్, అతడి తండ్రి గజ్జు మచ్చర్‌పై కేసు నమోదై, అరెస్ట్ అయ్యారు. చివరకు, తమ కోడలు సంగీత చేసిన పోరాటం నచ్చి, భిల్ గిరిజన పంచాయతీల తర్వాత అత్తింటి వారంతా తిరిగి తమ సొంత మతమైన ‘‘హిందూధర్మం’’లోకి మారారు. గత 20 ఏళ్లుగా అనుసరిస్తున్న క్రైస్తవ మతాన్ని వదలి సనాతన ధర్మంలోకి వచ్చారు. ప్రలోభాలకు లొంగి తాము క్రైస్తవ మతంలో చేరామని, ఇప్పుడు సొంత మతాన్ని ఆచరిస్తుండటం సంతోషంగా ఉందని ఆ కుటుంబం వెల్లడించింది.

కాబట్టి, హిందువులు ఇకపై కేవలం కులం ఒకటేనని, వధూవరుల జాతకాలు కుదిరాయని సరిపెట్టుకోవద్దు.. మీరు వియ్యం అందుకోదలచిన అవతలి కుటుంబం కూడా పూర్తిగా సనాతన హిందూ ధర్మాన్నే ఆచరిస్తోందా లేదా… అనేది ఒకటికి పదిసార్లు పరిశీలించి, తగిన విచారణ చేసి, ప్రత్యక్షంగా తెలుసుకుని మాత్రమే ముందుకెళ్ళండి… లేకపోతే మీ అమ్మాయి మరో రుతుజా, సోనాలిగా మిగిలిపోతుంది. అందరూ సంగీతలా ఉండాలనే అనుకోలేం… అయితే, మన పిల్లలకు చిన్నతనం నుంచీ హైందవ ఆచార సంప్రదాయాలని చక్కగా తెలియజేసి, పురాణేతిహాసాలను చదివిస్తూ పెంచితే ఈ కష్టాలు మన దరిదాపుల్లోకి కూడా రావు.