
371views
నంద్యాల జిల్లా, సేవా భారతి సంఘమిత్ర సేవా సమితి, ఆధ్వర్యంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా, స్థానిక సేవా బస్తీలోని పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఇందులో భాగంగా జిల్లా సేవా ప్రముఖ్ శ్రీ సంఘా శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంఘమిత్ర సేవా సమితి సహకారంతో బైటిపేట (సేవాబస్తీ)లో 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ కె.మహేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ వి.వి.రమణయ్య గౌడ్, స్వయం సేవకులు శ్రీ చావ్వ రాంభూపాల్ రెడ్డి, శ్రీ ఎస్. పరమేశ్వర్ రావు, శ్రీ పీవీ నరసింహ, శ్రీ నిమ్మకాయల సుధాకర్, స్థానికులు శ్రీమతి అశ్విని (అభ్యసిక మాతాజీ) శ్రీ ప్రదీప్, స్థానిక పెద్దలు, మాతృమూర్తులు పాల్గొన్నారు.





