News

గిరిజన బాలికను అత్యాచారం చేసి చంపిన సద్దాం హుస్సేన్

299views

అస్సాంలో హిందూమహిళలపై అఘాయిత్యాలు రానురాను పెరుగుతున్నాయి…అస్సాంలోని బజాలి జిల్లాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని, ఆమె ప్రియుడు అని చెప్పబడుతున్న ఆరిఫ్ అహ్మద్ దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల బాధితురాలిని నిందితుడు ఆరిఫ్ తనను తాను హిందూ బాలుడిగా పరిచయం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి హయ్యర్ స్కూల్ అప్పటి నుంచే పరిచయం ఉంది. క్రమంగా స్నేహం చేసి ప్రేమపేరుతో ఆమెను వంచించాడు. అతను హిందువు అనే అనుకుంది..ప్రేమపేరుతో అతను చెప్పే మాయమాటలు నమ్మింది. కానీ ఆరిఫ్ నిజమైన గుర్తింపు గురించి కొద్దిరోజుల తర్వాత ఆమెకు తెలిసింది. నిజం తెలుసుకున్న తర్వాత బాధితురాలు నిందితుడితో తనకున్న అన్ని సంబంధాలను వదులుకుంది. ఆమె అతన్ని కలవడానికి కూడా నిరాకరించింది. తన కుటుంబం చెప్పినదాని ప్రకారం గత రెండు సంవత్సరాలగా ఆరిఫ్ తో ఆమెకు ఎలాంటి కమ్యునికేషన్ లేదు.

కానీ జూలై 18 రాత్రి, నిందితుడు ఆరిఫ్ సరుపేట పట్టణంలోని ఆమె అద్దె గదిలోకి చొరబడి ఆమెను హత్య చేశాడు. తరువాత ఆరిఫ్ ఆమెను తాడుతో ఉరితీసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్నస్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు, బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని అదనపు ఎస్పీ త్రినాయన్ భూయాన్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని, తదుపరి దర్యాప్తులో వివరాలు వెలుగులోకి వస్తాయి అన్నారు.

ఇదిలా ఉంటే, జూన్ 16న నాగావ్ జిల్లాలోని రాష్ట్ర రహదారిపై ఆ యువతి గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. బాధితురాలు కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు చెందిన గిరిజన బాలిక అని దర్యాప్తులో తేలింది.వివరాల్లోకి వెళితే కర్బీ అంగ్లాంగ్ కి చెందిన గిరిజన బాలిక జూన్ 15న సాయంత్రం నాగావ్ బస్ స్టేషన్‌లో బస్సు ఎక్కించడానికి కారు డ్రైవర్ ను పెట్టుకుంది. కార్ డ్రైవర్ అయిన సద్దాం హుస్సేన్ రాత్రి సమయాన్ని ఆసరాగా చేసకుని ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేశాడు. తర్వాత అతను ఆమెని చంపి, అర్ధరాత్రి నాగావ్ పట్టణంలోని రాష్ట్ర రహదారిపై ఆమె మృతదేహాన్ని విసిరివేసాడు. ఈ విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో వెళ్లడయ్యాయి. బాధిత గిరిజన బాలిక జూన్ 15న దిఫు పట్టణానికి వెళ్లి అప్పటి నుండి కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబం తెలిపింది. ఈ సంఘటన గురించి పోలీసుల ద్వారానే తమకు తెలిసింది. కానీ నిందితుడు సద్దాం హుస్సేన్‌తో ఆమె రాత్రిపూట నాగావ్ జిల్లాకు ఎలా చేరుకుందో ఆ పేద కుటుంబానికి తెలియదు. దాంతో సెంట్రల్ అస్సాంలోని నాగావ్ పోలీసులు జూలై 18 రాత్రి సద్దాం హుస్సేన్ ని అరెస్టు చేశారు పోలీసులు. యువతిని రేప్ చేసి చంపేసాడని నేరాన్ని ఒప్పుకున్నాడు.