News

హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం

244views

ఈనెల 13న హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కర్నూల్ నగరంలోని లలిత పీఠంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ లలితా పీఠం వ్యవస్థాపకులు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం తెలిపారు. శ్రీ లలిత పీఠం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం రాష్ట్ర ప్రముఖులు టి.ప్రతాపరెడ్డితో కలిసి ఆయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వివిధ జిల్లాల నుంచి స్వామీజీలు, పీఠాధిపతులు హాజరవుతున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యముందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు