ArticlesNews

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

208views

మొహర్రం సందర్భంగా ముస్లిములు పీర్ల పండుగ చేసుకోవడం సాధారణం. అయితే హిందూ దేవాలయాల్లో పీర్లను ఉంచడం ద్వారా ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొహర్రం సందర్భంగా అలాంటి రెండు సంఘటనలు తెలంగాణలో వెలుగు చూసాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హిందువుల మీద దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా 2025లో మొహర్రం వేళ చోటు చేసుకున్న అలాంటి ఘోరాలను ఒకసారి పరిశీలిద్దాం…

(1) గుడిలో పీర్లు – సిక్యులర్ హిందువుల ఘాతుకం:
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఈ యేడాది జులై నెల ప్రారంభంలోనే పీర్లు పెట్టే ప్రయత్నం చేసారు. అయితే అప్పుడు స్థానిక హిందూ యువకులు అడ్డుకున్నారు. అయితే గ్రామపెద్ద, మాజీ సర్పంచ్ అయిన టి రవీందర్ రెడ్డి స్వయంగా దగ్గర ఉండి జులై 3వ తేదీన మళ్ళీ గుడిలో పీర్లు పెట్టించాడు. ఆ చర్యను స్థానిక హిందూ యువకులు తీవ్రంగా ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన రవీందర్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ – ఉమ్మడి కార్యాచరణ సంఘం) డిమాండ్ చేసింది.

(2) వర్గల్‌ గుడిలోనూ తురక పీర్లు:
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వర్గల్ గ్రామం భాగ్యనగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి సరస్వతీ అమ్మవారి దేవాలయం ప్రఖ్యాతమైనది. అంతే కాక వేణుగోపాల స్వామి ఆలయం కూడా స్థానికులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాంటి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ యేడాది పీర్లు వెలిసాయి. జులై 6 ఆదివారం నాడు వేణుగోపాల స్వామి ఆలయంలో అక్రమంగా వెలిసిన పీరీలను చూసి హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనకూ లోనయ్యారు. ఆలయ మంటపంలోని హిందూ దేవీ దేవతా మూర్తుల దగ్గర పీరీలు కట్టేయడాన్ని హిందువులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.

ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చాలానే జరిగాయి. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో మొహర్రం ఊరేగింపుల (జులూస్‌) సందర్భంగా జరిగిన నేరాలూ ఘోరాలూ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం….

(3) మొహర్రం ఊరేగింపులో హిందూ యువకుడి హత్య:
తేదీ: 06-07-2025
ప్రదేశం : తూర్పు చంపారణ్ జిల్లా
రాష్ట్రం : బిహార్

కన్‌కట్టీ బజార్‌లో మొహర్రం సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఆ ఊరేగింపును చూస్తున్న అజయ్ కుమార్ రాయ్ (35) అనే యువకుడి మీద ముస్లిములు గుంపుదాడి చేసారు. కత్తులతో నరికేసారు. ఆ సంఘటనలో అజయ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అజయ్‌కు రాజేష్ రాయ్ అనే సోదరుడు ఉన్నాడు. అతను గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసాడు. అప్పట్లో అతనికి స్థానికంగా ఉన్న నిజాముద్దీన్ అనే వ్యక్తితో గొడవ అయింది. ఆ గొడవ కారణంగానే ఇప్పుడు మొహర్రం ఊరేగింపు సమయంలో ముస్లిం మూక అజయ్ మీద కత్తులతో దాడి చేసి చంపేసి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

(4) మొహర్రం ఊరేగింపులో గుడిపై రాళ్ళ దాడి:
తేదీ: 06-07-2025
ప్రదేశం : కటిహార్
రాష్ట్రం : బిహార్

కటిహార్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ముస్లిం మూక హిందువుల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రాళ్ళ దాడులకు పాల్పడింది. ఆ క్రమంలోనే ఒక దేవాలయం మీద రాళ్ళు రువ్వారు. ముస్లిముల రాళ్ళ దాడి కారణంగా ఆ గుడితో పాటు దాని ముందు ఉన్న మోటార్ సైకిళ్ళు కూడా దెబ్బ తిన్నాయి. జరిగిన సంఘటన గురించి తెలియగానే జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలం దగ్గరకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

(5) మొహర్రం సందర్భంగా పోలీసులకే దెబ్బలు:
తేదీ: 06-07-2025
ప్రదేశం : ఉజ్జయిని
రాష్ట్రం : మధ్యప్రదేశ్

ఉజ్జయిని నగరంలో మొహర్రం సందర్భంగా స్థానిక ముస్లిములు ఊరేగింపు చేపట్టారు. ఆ సందర్భంగా, మూసివేసి ఉన్న ఒక దారిలో నుంచి ఊరేగింపు సాగించడానికి ప్రయత్నించారు. దాంతో వారిని నిలువరించడానికి అక్కడున్న పోలీసులు ప్రయత్నం చేసారు. అయినా ముస్లిముల మూకలు ఆగలేదు. అక్కడ పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను పడవేసారు. పోలీసుల మీద సైతం దాడి చేసారు. ఆ క్రమంలో ఇద్దరు పోలీసులకు బలమైన గాయాలయ్యాయి. దాంతో జీవాజీగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసారు. ఊరేగింపు నిర్వాహకుడు ఇర్ఫాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైంది.

(6) మొహర్రం హింసలో 12మందికి గాయాలు:
తేదీ: 06-07-2025
ప్రదేశం : గోపాల్‌గంజ్‌
రాష్ట్రం : బిహార్

గోపాల్‌గంజ్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా శికమీ, ఛవహీ తక్కీ గ్రామాల ప్రజలు వేర్వేరు ఊరేగింపులు ప్రారంభించారు. ఆ రెండూ ఒకదానికి ఒకటి ఎదురు పడినప్పుడు రెండు పక్షాల మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా వేగంగా హింసాత్మకంగా పరిణమించింది. ఇరుపక్షాల వారూ కర్రలు, ఇటుకలు, రాళ్ళతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ హింసాత్మక సంఘటనలో కనీసం 12 మంది గాయపడ్డారని అంచనా.

(7) వివాదాస్పద దారిలో ఊరేగింపు, ఘర్షణలో ఇద్దరికి గాయాలు:
తేదీ: 06-07-2025
ప్రదేశం : పలామూ
రాష్ట్రం : ఝార్ఖండ్

ఝార్ఖండ్ రాష్ట్రం పలామూ జిల్లా పాటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. ఆ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివాదాస్పద మార్గంలో ఊరేగింపు వెడుతోంది. ఆ క్రమంలో రెండు పక్షాల మధ్యా గొడవ చెలరేగింది. ఇరు పక్షాల వారూ పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఆ క్రమంలో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.

(8) హిందువుల ఇళ్ళలోకి చొరబడి మరీ దాడులు:
తేదీ: 06-07-2025
ప్రదేశం : లఖీంపూర్ ఖేరీ
రాష్ట్రం : ఉత్తరప్రదేశ్

శారదా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా గావ్‌ ప్రాంతంలో మొహర్రం సందర్భంగా తాజియా ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపులో తెల్లటి పొడి చల్లారనే విషయం చినికి చినికి గాలివాన అయింది. రాళ్ళ దాడులకు దారి తీసింది. ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు టపాకాయలు పేలుస్తుండడంతో పాటు తెల్లటి పొడిని గాల్లోకి విసురుతున్నారు. అలా ఆ ఊరేగింపులో పాల్గొన్న ముస్లిం మూక, గ్రామంలోని సియారామ్, జమునాదీన్ అనే వ్యక్తుల ఇళ్ళ మీదకు కూడా తెల్లటి పొడి విసిరారు.

అలా తమ ఇంటి మీదకు తెల్లటి పొడి విసరవద్దంటూ సియారామ్ ప్రతిఘటించాడు. దాంతో ఊరేగింపులో ఉన కొంతమంది ముస్లిముల మూక, జమునాదీన్ ఇంట్లోకి చొరబడి, అతని మనవడైన పంకజ్‌ను చితకబాదారు. దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్దసంఖ్యలో గ్రామంలోకి చేరుకుని పరిస్థితిని అదుపు లోకి తీసుకొచ్చారు.

(9) బస్సుకు నిప్పు పెట్టిన ముస్లిం మూక:
తేదీ: 06-07-2025
ప్రదేశం : హాజీపూర్
రాష్ట్రం : బిహార్‌

బలిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చికనౌటా గ్రామంలో రహదారి మీద మొహర్రం తాజియా జులూస్ (ఊరేగింపు) జరుగుతోంది. రోడ్డు మీద ఊరేగింపు వద్దంటూ కొందరు అభ్యంతరపెట్టారు. దానితో కోపగించుకున్న ముస్లిం యువకులు ఆ సమయంలో సమస్తిపూర్‌ నుంచి వస్తున్న ఒక బస్సు మీద దాడి చేసారు. ముందుగా బస్సులో ఉన్నవారిని చితకబాది కిందకు దింపేసారు. తరవాత బస్సును ధ్వంసం చేసారు. చివరిగా ఆ బస్సుకు నిప్పు పెట్టారు. విషయం తెలిసిన జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వీలైనంత వేగంగా చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

(10) ధోల్‌పూర్‌లో ఊరేగింపు గురించి గోల:
తేదీ: 06-07-2025
ప్రదేశం : ధోల్‌పూర్
రాష్ట్రం : రాజస్థాన్

మనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాంగ్‌రోల్ కస్బాలో మొహర్రం సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఆ ఊరేగింపు వెడుతున్న దారిలో ఒకచోట ఏకాదశీ పాఠం జరుగుతోంది. దాన్ని గమనించిన ముస్లిముల మూక ఉద్దేశపూర్వకంగా తమ డీజే సౌండ్‌ను విపరీతంగా పెంచారు. హిందువులు ఆ డీజే సౌండ్ తగ్గించమని అడిగారు. దానికే ముస్లిములు విపరీతంగా రెచ్చిపోయారు. ఏకాదశి పాఠం చదువుకుంటున్న మైక్‌ తీసేయాలంటూ గొడవ పెట్టారు. అంతలో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరుపక్షాలకూ సర్దిచెప్పి గొడవ పెరగకుండా ఆపారు.

(11) హిందువులతో గొడవ, కొట్లాట:
తేదీ: 06-07-2025
ప్రదేశం : కుశీనగర్
రాష్ట్రం : ఉత్తరప్రదేశ్

రామ్‌కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెకువాటార్ బజార్‌లో మొహర్రం తాజియా ఊరేగింపు జరుగుతోంది. ఆ ప్రాంతంలో కొంతమంది హిందువులు ఉన్నారు. వారిని చూసి ముస్లిములు గట్టిగా నినాదాలు ప్రారంభించారు. హిందువులను నిందిస్తూ కేకలు వేయసాగారు. ఆ నినాదాలను హిందువులు ప్రతిఘటించారు. దాంతో మాటా మాటా పెరిగింది. గొడవ ముదిరి చేతులతో కొట్టుకునే వరకూ వెళ్ళింది. దాంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ముస్లిం మూక హిందువుల మీద దాడికి పాల్పడింది. ఆ దాడిలో ఎనిమిదేళ్ళ పిల్లవాడికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బల ప్రయోగం చేసి ఇరు పక్షాలనూ నియంత్రించారు. గొడవలు ముదరకుండా అదనపు బలగాలను మోహరించారు.

(12) ఊరేగింపు కోసం ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి, ఫైరింగ్:
తేదీ: 06-07-2025
ప్రదేశం : భాగల్‌పూర్
రాష్ట్రం : బిహార్

లోదీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తూ గ్రామంలో మొహర్రం సందర్భంగా ఊరేగింపు ఏర్పాటు చేసారు. ఆ సమయంలో ఊరేగింపు వెళ్ళే దారి గురించి ఇరు పక్షాల మధ్యా గొడవ రేగింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గొడవ బాగా ముదిరిపోయింది, హింసాత్మకంగా మారింది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది, ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ గొడవలో పాతిక మందికి పైగా గాయపడ్డారు.

(13) హనుమ ధ్వజం పక్కన, అంతకంటె ఎత్తుగా ఇస్లామిక్ జెండా:
తేదీ: 06-07-2025
ప్రదేశం : గిరిడీ
రాష్ట్రం : ఝార్ఖండ్

గిరిడీ ప్రాంతానికి చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిపోయింది. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఒక ముస్లిం యువకుడు రోడ్డు మీద ఉన్న ఒక సైన్ బోర్డు మీద ఇస్లాం జెండా పెట్టాడు. ఆ యువకుడు ఒక హైడ్రాలిక్ డంపర్ సహాయంతో సైన్ బోర్డు పైన వరకూ చేరుకున్నాడు. నిజానికి అక్కడ అప్పటికే హనుమంతుడి జెండాలు గతంలోనే పెట్టి ఉన్నాయి. ఆ హనుమాన్ జెండాల పక్కనే, వాటి కంటె ఎక్కువ ఎత్తు ఉండేలా ఇస్లామిక్ జెండాలు పెట్టాడు. అంతే కాదు, ‘నారా యే తక్‌బీర్ – అల్లా హో అక్బర్’ అంటూ నినాదాలు చేసాడు. అల్లా అందరికంటె గొప్పవాడు, అల్లాను మించిన వారు ఎవరూ లేరు అనే ఉద్దేశం అతని సొంత ఆలోచన, అతని ఇష్టం. కానీ రహదారి మీద వేరే జెండాలు ముందుగానే ఉన్నప్పుడు వాటికంటె ఎత్తులో ఇస్లామిక్ జెండాలు అమర్చడం దేనికి చిహ్నం? హిందువుల పట్ల ముస్లిముల అసహనానికి ఆ సంఘటన నిదర్శనంగా నిలిచింది.

ఉపసంహారం:
ఏ మతస్తులైనా తమ మతానికి చెందిన పండుగలను, రీతి రివాజులనూ జరుపుకోవడంలో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. అయితే పని కట్టుకుని, పక్క మతాన్ని చులకన చేయడం, ఆ మతం వారి మీద దాడులు చేయడం, మరో మతస్తుల మందిరాలలోకి చొరబడి తమ మతచిహ్నాలను అక్కడ పెట్టడం… ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనేది భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు అందించిన మతస్వేచ్ఛకు పూర్తి వ్యతిరేకం. అయినప్పటికీ ముస్లిములు తమ పండుగలు, పర్వదినాల సందర్భాల్లో ఇతరులను కించపరిచేలా వ్యవహరించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ ఒక్క సంవత్సరంలోనే, అధికారికంగా నమోదయిన అలాంటి సంఘటనలు ఇన్ని ఉంటే, అనధికారికంగా జరిగినవి, ఇతరులు బైటపెట్టనివీ అయిన సంఘటనలు ఎన్ని జరిగి ఉంటాయో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.