
మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో మొహర్రం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముస్లిం యువకులు హిందూరాష్ట్ర, ఓం అని రాసివున్న పరమ పవిత్ర కాషాయ జెండాను తగలబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
మొహర్రం ఊరేగింపు సందర్భంగా మసీదు స్క్వేర్ ప్రాంతం నుంచి వెళ్తుండగా… రకరకాల విన్యాసాలు చేశారు. కాషాయ జెండా వున్న వైపు తిరిగి, అవమానకరంగా విన్యాసాలు చేసినట్లు అందులో కనిపించింది.
ఉద్దేశపూర్వకంగానే, హిందువుల మనోభావాలను రెచ్చగొట్టాలన్న దురుద్దేశంతోనే ముస్లింలు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక హిందూ సమాజం కూడా ఇవే ఆరోపణలు చేసింది. తమకు కాషాయ జెండా అత్యంత పవిత్రమని, ఓం చిహ్నం కూడా అంతే పవిత్రమని, దీనిని ముస్లింలు దహనం చేయడం ఏంటని ప్రశ్నించారు.
‘‘ఇది తమను రెచ్చగొట్టడమే. ఇంత బహిరంగంగా కాషాయ జెండాను అవమానపరిచినా… కొందరు మౌనంగా వుండిపోతున్నారు. హిందూ చిహ్నాలను అగౌరవపరిస్తే సహించం’’ అని హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు రాజేంద్ర శర్మ హెచ్చరించారు. అంతేకాకుండా జాతీయ భద్రతా చట్టం కింద నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
కాషాయ జెండాకు ముస్లిం ఛాందసులు నిప్పు పెట్టడంపై హిందువులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మొహర్రం ఊరేగింపు బాధ్యులతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాకేష్ ఖాఖా వెల్లడించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు బలగాలు కూడా మోహరించామని కూడా తెలిపారు.





