
202views
గోవధ నిషేధం, గో సంతతి పరిరక్షణ, హిందూ దేవాలయ, ధర్మాదాయ సంస్థల పరిరక్షణ కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీతంపేటలో మాతృరూపిణీ సేవా సంస్థ వ్యవస్థాపకుడు అజ్జరపు హరిబాబు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. హరిబాబు మాట్లాడారు. పది రోజులపాటు దీక్షలు నిర్వహిస్తామని, పాలకుల నుంచి తగిన హామీ లేకపోతే నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. దీక్షకు ముందు గో సూక్తం పఠించి హోమం, వేదస్వస్తి పలికారు. హిందూ చైతన్య వేదిక ప్రతినిధి పట్నాల సూరిబాబు, బ్రాహ్మణ యువజన సంఘం నాయకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యం దీక్షలో పాల్గొ న్నారు. గుళ్లపల్లి సీతారామ శ్రీహర్ష ఘనపాఠి, శ్రీరామ అవధాని, గాడేపల్లి వెంకట రమణ తది తరులు పాల్గొన్నారు.





