News

దర్భాంగాలో మత ఘర్షణలు.. 42 మంది అరెస్ట్

264views

పాట్నా దర్భంగాలోని పోహద్ది గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఘర్షణలకు కారణమైన 40 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం (జూలై 1) న ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాలకు సంబంధించిన 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

నిజానికి మొదట్లో పిల్లల మధ్య చిన్న గొడవ మొదలైంది. ఇది కాస్తా రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణగా మారిపోయింది. మొహర్రం జెండాలను వుంచడంపై మొదట గొడవ జరిగిందని, తర్వాత ఘర్షణకు దారితీసింది. దీని ఫలితంగానే ఇరువురూ రాళ్లు రువ్వకున్నారని పోలీసులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని, పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కఠిన చర్యలను ప్రారంభించారు. హిందూ, ముస్లింలకు సంబంధించి 41 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే పరారీలో వున్న నిందితులను కూడా పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.