News

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో షకీల్ అహ్మద్ అరెస్ట్

164views

పాట్నాలోని తూర్పు చంపారన్ జిల్లాలోని బంజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని షకీల్ అహ్మద్‌గా గుర్తించారు. బాధిత బాలిక తన సోదరుడితో కలిసి కారులో వేరే ప్రాంతానికి ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. నిందితుడు షకీల్ ఆ కారును ఆపి, బాలికను కత్తితో బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ నేరం గురించి తెలసుకున్న స్థానికులు నిందితుడు షకీల్ ను వెంబడించి మరీ పట్టుకుని కొట్టి, పోలీసులకు అప్పగించారు. మీడియా సమాచారం ప్రకారం నిందితుడు కేవలం ఈ బాలికను మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలోని ఇతర బాలికలను కూడా లైంగికంగా వేధించాడని విచారణలో తేలింది. అలా లైగింక వేధింపుల కేసులో ఇంతకుముందు కూడా స్థానిక పంచాయితీ వద్ద పెద్దల మధ్య పంచాయితీ జరిగింది. అయినప్పటికీ అతని దుష్ర్పవర్తన మానలేదు. ఈ సంఘటనకు సంబంధించి బంజారియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది, బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.