News

పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

323views

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్‌ స్వామి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సందీప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్‌ 08313 విశాఖ – పూరీ స్పెష ల్‌ (26న అర్ధరాత్రి దాటాక) ఈ నెల 27 నుంచి జూలై 5 వరకూ, తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్‌ 08314 పూరీ – విశాఖ స్పెషల్‌ ఈ నెల 28 నుంచి జూలై 6 వరకూ నడుస్తుంది. జగదల్‌పూర్‌ – పూరీ – జగదల్‌ పూర్‌ స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 08445 ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకూ, తిరుగు ప్రయాణంలో 0844 6 ఈ నెల 28 నుంచి జూలై 6వరకూ నడుస్తుంది. అదేవిధంగా రాయగడ – కురదారోడ్డు – రాయగడ స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 08593 ఈ నెల 26 నుంచి జూలై 7వరకూ తిరుగు ప్రయాణంలో 08594 కుర్దారోడ్డు – రాయగడ స్పెషల్‌ ఈ నెల 28 నుంచి జూలై 6 వరకూ నడుస్తాయి. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.