
263views
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్ నగరం జూన్ 16వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే’ గా ప్రకటించింది. సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత, స్వస్థత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిరంతర ప్రయత్నాలను గుర్తిస్తూ జూన్ 16వ తేదీని అధికారికంగా ‘శ్రీశ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే’గా ప్రకటించింది. నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆ నగర మేయర్ అధికారికంగా శ్రీశ్రీ రవిశంకర్కు అధికారికంగా పత్రాన్ని అందజేశారు. శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న 32వ నగరంగా (ప్రపంచంలో) జాక్సన్విల్ నిలిచింది.





