
మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో లక్షలాది మంది హిందువుల ప్రార్థనా స్థలం అయిన శ్రీ శని శింగనాపూర్ ఆలయ పవిత్ర వేదిక ‘గ్రిల్’ను శుభ్రం చేయడానికి పెయింటింగ్ పనులుకు ముస్లిం కార్మికులతో ఏర్పాటు చేశారు.మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ మరియు హిందూ సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి మరియు ఈ ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశాయి
ఈ నేపధ్యంలో, ఆలయ ధర్మకర్తల బోర్డు 114 మంది ముస్లిం ఉద్యోగులు ట్రస్ట్‌లో పనిచేస్తున్నారని అంగీకరించింది. దీని తరువాత, శని శింగనాపూర్ దేవస్థానం 114 మంది ముస్లిం ఉద్యోగులతో సహా మొత్తం 167 మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించింది.
మహారాష్ట్ర మత్స్య, ఓడరేవుల మంత్రి నితేష్ రాణే ణే కూడా ముస్లిం ఉద్యోగులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. నితేష్ రాణే డిమాండ్ కారణంగా, శని శింగనాపూర్ దేవస్థాన్ ట్రస్టీల వివరణ ఇచ్చారు. ఈ ముస్లిం ఉద్యోగులలో ఎవరూ ఆలయ ప్రధాన గర్భగుడిలో లేదా ఆలయ వేదికలో పనిచేయడం లేదని ట్రస్ట్ బోర్డు తెలిపింది. ఈ ఉద్యోగులు ప్రధానంగా వ్యవసాయ శాఖ, చెత్త నిర్వహణ మరియు విద్యకు సంబంధించిన ప్రదేశాలలో పనిచేస్తున్నారని, గత 5 నెలలుగా 99 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేదని తెలిపింది. కాగా ఆలయంలో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులను తొలగించామని ప్రకటించింది.
హిందూ సంస్థలు చేసిన డిమాండ్ పూర్తిగా సమర్థనీయమైనది. ఒక హిందూ వ్యక్తి ముస్లిం మతపరమైన హాజీ అలీ లేదా అజ్మీర్ దర్గాలో పని చేయవచ్చా? ఇందుకు వారు ఒప్పుకుంటారా ? హిందూ మతపరమైన ప్రదేశాలకు సంబంధించి మాత్రమే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ? హిందూ మతపరమైన ప్రదేశాల ప్రతిష్ట పదేపదే రాజీపడే విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మంత్రి నితేష్ రాణే తెలిపారు





