News

విమాన ప్రమాదంలో చెక్కు చెదరని భగవద్గీత ప్రతి

243views

మొత్తం 265 మంది… ప్రాణాలను బలి తీసుకున్న అహ్మదాబాద్ విమాన ప్రమాద శకలాల్లో భగవద్గీత దాదాపు చెక్కు చెదరని రీతిలో లభ్యమైంది. కాలిపోయిన శిథిలాల మధ్యన భగవద్గీత గ్రంథం కనిపించింది. ఘటనాస్థలిలో విమాన ఇంధనం, శకలాలు పడిన చోట్ల తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినా ఈ పవిత్ర గ్రంథానికి పెద్దగా నష్టం కలగకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మంటల తీవ్రతకు విమానం లోని చాలా భాగాలతోపాటు, అందులోని ఇతర వస్తువులు సైతం కరిగిపోయి, నామరూపాల్లేకుండా కాలిపోయాయి. అయినప్పటికీ భగవద్గీత ప్రతికి ఎలాంటి నష్టం జరగలేదు. కవర్ పేజీ మాత్రమే దెబ్బతిన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.