News

ముస్లింలు స్థానిక ప్రజల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించాలి

276views

రాష్ట్రంలో హిందువుల మతపరమైన ప్రదేశాలు, సంప్రదాయాలను తారుమారు చేయడాన్ని సహించబోమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. దేవాలయాల స్థానంలో మసీదులను నిర్మించడం సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.’స్త్ర’ అస్సాం సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక గుర్తింపుకు చిహ్నాలు అని అన్నారు. ఈ సంస్థలు శ్రీమంత శంకర్‌దేవ్ ప్రారంభించిన ఏకశరణ ధర్మ (నవ-వైష్ణవ మతం) కు చెందినవని ఇవి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ప్రభావాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.

కానీ ప్రస్తుతం, ధుబ్రి మరియు బార్పేట వంటి కొన్ని ప్రాంతాలలో, సత్రాల భూమిని అక్రమంగా ఆక్రమించి, అక్కడ మసీదులు నిర్మించిన కేసులు వెలుగులోకి వచ్చాయని ఇటువంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతను పెంచుతుందన్నారు. సత్రం దగ్గర మసీదు నిర్మించబడినప్పుడు, అజాన్ శబ్దం నామ్‌ఘర్‌కు చేరుకున్నప్పుడు అది ‘చర్చించలేని అంశం’గా మారుతుందని . ఏదైనా ప్రదేశంలో సంఘర్షణ పరిస్థితి తలెత్తితే, బయటి వ్యక్తులు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని సూచించారు. అందువల్ల, సత్రాలను రక్షించాలని మరియు వాటి సాంస్కృతిక పాత్రను కొనసాగించడంలో సహకరించాలని ముస్లింలకు సూచించారు.

‘సత్తర్లు’ అంటే అస్సాంలో ఉన్న వైష్ణవ మఠాలు, ఇవి ఏకాదశరణ మతం లేదా నవ-వైష్ణవ మతానికి చెందినవి. ఇది 15-16వ శతాబ్దంలో సాధువు-సామాజిక సంస్కర్త మహాపురుషుడు శ్రీమంత శంకర్‌దేవ్ ప్రారంభించిన ఏకేశ్వర భక్తి ఉద్యమ కాలంలో నిర్మితమైయ్యాయి.