
¸ùsZOÆðrç³:06MðSÑBÆ25: MöÐ]lNÓÆý$ Ð]l§ýlª BÐ]l#˯]l$ èlÆýÍçÜ$¢¯]l² I^èlÆ ÌêÈ
197views
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద ఐషర్ లారీలో అక్రమంగా తరిలిస్తున్న ఆవులు, దూడలు, ఎద్దులను కొవ్వూరు సీఐ పి.విశ్వం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని గ్రామన్ బ్రిడ్జి వద్ద రోడ్డు బొబ్బిలి నుంచి తుని మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి అందులని 16 ఆవులు, 18 దూడలు, నాలుగు ఎద్దులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతి లేకుండా గోవులను తరలిస్తే చర్యలు తప్పవని విశ్వం తెలిపారు. దీనిపై తాండ్ర నరేష్, పాసాదులు దుర్గాప్రసాద్‌లపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ తెలిపారు.





