News

మల్లన్న సేవలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి

246views

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ దంపతులకు ఆలయం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం కేంద్ర మంత్రి సంజయ్ సేత్ దంపతులు శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయం ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్లకు చిత్రపటం, తీర్థ ప్రసాదాలను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతు దంపతులకు అందజేశారు.