News

ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ను మీ దేశంలో అంతం చేయండి

214views

భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్న బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ అఖిలపక్ష బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. తొలుత మీ దేశంలో జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థను అంతం చేయండని, ఆ తర్వాతే మద్దతు కోసం ప్రయత్నించండంటూ అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ నిక్కచ్చిగా సూచించారు. అలాగే ప్రపంచంలోనే కరుడుగట్టిన అల్‌ఖైదా ఉగ్రనేత ఒసామా బిన్‌లాడెన్‌ను పట్టించడంలో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ)కి సాయం చేసిన పాకిస్థాన్‌ డాక్టర్‌ షకీల్‌ అఫ్రీదీని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ హఠాత్పరిణామంతో బిలావల్‌ బృందానికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను షెర్మన్‌ తన ‘ఎక్స్‌’లో పంచుకున్నారు.