News

సామూహిక ఉపనయన మహోత్సవం

271views

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో బ్రాహ్మణ వేద విద్యార్థులకు సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులు ఉపనయన ఘట్టాన్ని నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి ఉపనయనంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు, సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ చక్రవర్తి, వైస్‌ చైర్మన్‌ నిమిష్‌ పాండ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.