
హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 24 తేదిన విజయవాడ నగరంలోని రామకృష్ణపురం ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ ఉత్సవ విగ్రహాలతో నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించిన అనంతరం శ్రీనివాసకళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.వాంబే కాలనీలో ఉన్న వేంకటేశ్వర దేవస్థానంలో 50 జంటలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా SSF ప్రాంత అధ్యక్షులు శ్రీ విష్ణువు గారు SSF సాధించిన విజయాలు గురించి తెలియచేశారు. అలాగే SSF ప్రాంత సహ సంయోజకులు శ్రీ తులసి ప్రకాష్ గారు శ్రీ వేంకటేశ్వరస్వామి అనుభవాలను భక్తుల చేత చెప్పించారు. SSF ప్రాంత కోశాధికారి శ్రీ వేంకటేశ్వర రెడ్డి గారు SSF నిర్మాణం చేసిన దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న పనిని వివరించారు. అలాగే నగరాల్లో కూడా సేవా బస్తీలలో ఇటువంటి కార్యక్రమాలు ద్వారా మత మార్పిడిలు అరికట్టవచ్చు తెలిపారు

సుమారు 500 మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి , తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక పెద్దలు రాఘవ రాజు గారు స్వామివారి కల్యాణంలో భాగంగా పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమరసత సభ్యులైన వై వి కుమార్ గారు, వై వంశీకృష్ణ గారు, కృష్ణ సాయి గారు, SSF జిల్లా సహ కన్వీనర్ శ్రీ వడిపిన శివ కుమార్ గారు పాల్గొన్నారు. కళ్యాణం జరిపించడంలో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లడంలో స్థానిక SSF ధర్మప్రచారక్ ప్రతాప్ కృషి చేశారు.





