News

సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని అరెస్ట్ చేయాలంటూ సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు

298views

సోకాల్డ్ సెక్యులరిస్ట్ లుగా చెప్పుకునే వామపక్షాలు సనాతన ధర్మంపై అవరసమున్న లేకపోయిన విషం కక్కుతూనే ఉంటాయి. ఆ కోవలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి హైందవ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలి అన్న వ్యాఖ్యలపై నారాయణ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదని అవాకులు పేలారు.

“సనాతన ధర్మం అనేది అరాచకమైనది. అది భారత వ్యవస్థను మొత్తం వెనక్కి తీసుకెళ్లే క్రూరమైన చర్య. అలాంటి క్రూరమైన ఫిలాసఫీని ప్రచారం చేయడం చాలా ఘోరమైనది” అని నారాయణ తీవ్రంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారని, కానీ తాను మాత్రం సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్‌నే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి, సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని కాకుండా, దానిని సమర్థించే వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని శిక్షించాలి, విమర్శించే వారిని కాదనలని తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు.