News

భారత్‌ తలచుకుంటే పాక్‌ 4 ముక్కలు: రాజ్‌నాథ్‌

213views

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకాదళం రంగంలోకి దిగి ఉంటే పాకిస్థాన్‌ నాలుగు ముక్కలయ్యేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘1971లో భారత నౌకాదళం రంగంలోకి దిగితే పాకిస్థాన్‌ రెండు కింద విడిపోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో రంగంలోకి దిగి ఉంటే రెండు కాదు.. పాకిస్థాన్‌ నాలుగు ముక్కలయ్యేది’’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్‌ సయీద్, మసూద్‌ అజహర్‌లను భారత్‌కు పాకిస్థాన్‌ అప్పగించాలని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. చర్చలపై నిజంగా పాకిస్థాన్‌కు ఆసక్తి ఉంటే తక్షణమే ఈ పనిచేయాలని అన్నారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ పూర్తికాలేదు. విరామమిచ్చాం. పాకిస్థాన్‌ మళ్లీ తప్పు చేస్తే ఇంకా తీవ్రంగా స్పందిస్తాం. ఈసారి కోలుకోవడానికి కూడా అవకాశం ఉండదు’’ అని రక్షణ మంత్రి తెలిపారు.