
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఉన్న ఆధ్యాత్మిక గురువు జగద్గురు స్వామి రాంభద్రాచార్య ఆశ్రమాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ సందర్భంగా రామభద్రాచార్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రామభద్రాచార్య ఆర్మీ చీఫ్‌ను ‘‘పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి’’ అని కోరారు. ఈ విషయాన్ని రామభద్రాచార్య వెల్లడించారు.
‘‘భారత ఆర్మీ చీఫ్ నా దగ్గరికి వచ్చారు. ఆయన నా నుంచి రామ మంత్రాన్ని దీక్షగా తీసుకున్నారు. ఇదే మంత్రాన్ని హనుమంతుడు సీతాదేవి నుంచి పొందారు. లంకపై విజయం సాధించారు.ఈ సమయంలోనే దక్షిణ విషయం వచ్చింది. నేను దక్షిణ అడిగా. నాకు పీఎకే కావాలి అని అడిగాను. నా అభ్యర్థనను ఆర్మీ చీఫ్ అంగీకరించారు. పాకిస్తాన్‌కి తగిన సమాధానం ఇవ్వడానికి మేం సిద్ధంగా వున్నాం అని కూడా చెప్పారు’’ అని రామభద్రాచార్య వెల్లడించారు.
ఇక జనరల్ ద్వివేది ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా జగద్గురు రామభద్రాచార్య ఆయనకు హనుమంతుడి మంత్రాన్ని దీక్షగా ఇచ్చారు. ఈ మంత్రం ద్వారానే హనుమంతుడు లంకను జయించారని పేర్కొన్నారు. ఆశ్రమంలోని సాధువులు, వేద విద్యార్థులతో ఆర్మీ చీఫ్ సంభాషించారు.





