
356views
రాష్ట్రంలో 22 ప్రధాన ఆలయాల వద్ద భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ మొదటగా రాష్ట్రంలోని 22ప్రధాన ఆలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమం.. తరువాత 166దేవాలయాల్లో ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దూప దీపనైవేద్యాలకు నోచుకోని ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు వేదాలను పూర్తి చేసిన వారికు సంభావన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.





