News

పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డివిరిచాం

280views

ఆపరేషన్ సిందూర్‌తో భారత సాయుధ బలగాలు మెరుపుదాడులు జరిపి ఉగ్రవాదం మూలాలపై దాడి చేశాయని, పాకిస్థాన్ అర్మీ నెట్‌వర్మ్‌ను దిగొచ్చేలా చేశాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో జరిగిన డాక్టర్ కేఎన్ఎస్ మెమోరియల్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.

నిపుణులైన సర్జన్లులా..
పాకిస్థా్న్, పీఓకే‌లోని ఉగ్రవాద శిబిరాలపై మే 7న జరిపిన మిలటరీ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిపుణులైన సర్జన్లులా మన బలగాలు సత్తా చాటుకున్నాయని చెప్పారు. ”నిపుణులైన డాక్టర్లు, సర్జన్లు ఎలా వ్యవహరిస్తారో మన బలగాలు కూడా అలాగే పనిచేశాయి. ఉగ్రవాద మూలాలలై ప్రతిభావంతంగా దాడులు జరిపాయి” అని అన్నారు. భారత్ చేపట్టిన మిలటరీ ఆపరేషన్ ఎంతో క్రమశిక్షణతో, కచ్చితత్వంతో, పౌరులకు ఎలాంటి హాని జరక్కుండా నిర్వహించినట్టు చెప్పారు. ఉగ్రవాదులను శిక్షించడం, అమాయక ప్రజలకు ఎలాంటి హాని జరక్కుండా చూడటంలో మన బలాగాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాయని ప్రశంసించారు. పాకిస్థాన్ మాత్రం పౌరులు, ప్రార్థనా స్థలాలను టార్గెట్ చేసిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ”అది వాళ్ల (పాక్) అలవాటు. పాకిస్థాన్ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు. భారత భూభాగంపై ప్రతిదాడులకు ప్రయత్నించింది. పౌరులను, ప్రార్థనా స్థలాలను కూడా వదల్లేదు. అయితే మన బలగాలు వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చాయి” అని అన్నారు.

పాకిస్థాన్ భవిష్యత్తుపై యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ తన నాశనం తానే కొనితెచ్చుకుంటుందని అన్నారు. భారత్ చర్యల వల్ల కానీ, తాను పెంచిపోషించిన ఉగ్రవాదం వల్ల కానీ పాకిస్థాన్ నాశనం కానుందని జోస్యం చెప్పారు.