News

టిటిడి పాలకమండలి సమావేశ నిర్ణయాలు

297views

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్యభవనంలో టిటిడి పాలకమండలి సమావేశం జరిగింది. పాలకమండలి సమావేశం అనంతరం టిటిడి ఇఓ శ్యామలారావు పాత్రికేయులతో మాట్లాడుతూ స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని నిర్ణయించామని..రిటైర్డ్ ఐఏఎస్ ఐవి సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మేరకు స్విమ్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్ లో సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని..టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.మఠాల ఆక్రమణలపై పరిశీలన జరుగుతుంది… నిభందనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకురానున్నామని.. ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నప్రసాదం వితరణ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. రాజధాని అమరావతి సమీపంలోని అనంతవరంలోని శ్రీవారి ఆలయాభివృద్ధికి 10 కోట్లు నిధులు మంజూరు చేశామని..తిరుమల కొండల్లో పచ్చదనం పెంచాలన్న సీఎం అదేశానుసారం….ప్రభుత్వ అటవీశాఖకు రూ 4 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. టీటీడీలో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ పై గూగుల్ & టిసిఎస్ సంస్థలు కసరత్తు జరుగుతుందని.. టీటీడీలో ఉద్యోగ పదోన్నతులు అమలుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల తలెత్తిన సమస్యలు త్వరలో పరిష్కరించి ప్రమోషన్స్ ఇస్తామన్నారు.