News

వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయండి

316views

కర్నూలు జిల్లా నంద్యాల విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని నంద్యాల నగర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, శోభాయాత్ర సహ ప్రముఖులు యర్రగుంట్ల రామ్‌ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమంతుడిని తలచిన వెంటనే సకల భయాలు తొలగించి విజయం అందిస్తాడన్నారు. అంజనీ సుతుని జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా జరిగే శోభాయాత్ర 22వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డు నుంచి ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు కాల్వ శేష సాయి, తదితరులు పాల్గొన్నారు.