
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గత 99 సంవత్సరములుగా సమాజంలోని వ్యక్తులలో దేశభక్తిని, సేవాభావాన్ని, సమరసతను, స్వాభిమానమును నిర్మాణం చేస్తూ భారతదేశం యొక్క పరమవైభవస్థితి సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నది. భారతదేశాన్ని జగద్గురు స్థానం లో నిలపడానికై కృషిచేస్తూ విజయదశమి 2025 నాటికి 100 సంవత్సరములు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి సంవత్సరం వేసవిలో కార్యకర్తల శిక్షణా కార్యక్రమము (సంఘ శిక్షావర్గ) నిర్వహిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవ్సరం కూడా సంఘ శిక్షావర్గ 15 రోజుల శిక్షణ శ్రీ విజ్ఞాన విహార పాఠశాల నూతక్కిలో నిర్వహిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముగింపు కార్యక్రమం (సార్వజనికోత్సవము) శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ పర్చూరి ధర్మ తేజ గారు CMD, సక్కు ఇండస్ట్రీస్, గుంటూరు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్, విజయవాడ శ్రీ విజయాదిత్య గారు వక్తగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమం ప్రారంభంలో శిక్షార్థులచే శారీరిక ప్రదర్శనలను నిర్వహించారు
యలమంచిలి సాయేశ్వర రావు వర్గ సర్వాధికారిగా వ్యవహరించారు




