News

గోవులను కబేళాలకు తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

741views

గోవులను కబేళాలకు తరలిస్తున్న రెండు వాహనాలను చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.  విజయనగరం జిల్లా నరసన్నపేట సమీపంలోని చింతూరు వద్ద సీఐ యువ కుమార్, ఎస్సై సురేష్ కుమార్, మరియు సిబ్బంది  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గోవులతో వెళ్తున్న రెండు వాహనాలు కనిపించాయి.  ఆ వాహనాలలో గోవులు ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ వాహనాలను సీజ్ చేసి, అందులోని నిందితులు మహమ్మద్ ఖలీల్ (హైదరాబాద్), వకీన్ అహ్మద్ (హర్యానా), ఖలీద్ ఖాన్ (హైదరాబాద్), మహమ్మద్ సబిన్ (హైదరాబాద్), మహ్మద్ హమీద్ (చింతూరు), అవనిగడ్డ హిమావత్ (వరంగల్), సంగి సంపత్ (వరంగల్), మహ్మద్ ఫయాజ్ (వరంగల్), మహ్మద్ బషీర్ (వరంగల్) లను అరెస్టు చేశారు. పోలీసులు ఆయా వాహనాలలో ఉన్న59 గోవులను గోకవరం గోశాలకు తరలించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.