News

తిరుమలపై మంత్రి నాని దురుసు వ్యాఖ్యలు – చర్యలకు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు

753views

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తిరుమల దర్శనంతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. సీఎం జగన్ ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలయాన్ని ఎవడమ్మమొగుడు నిర్మించాడని ఆయన తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు.

మంత్రి నాని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు, పలు ఆధ్యాత్మిక సంఘాలు కూడ విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ చైతన్య వేదిక, బాలాజీ భక్త బృందంతో పాటు ఇతర సంఘాలు పలు విమర్శలు చేశాయి. భక్తుల విశ్వాశాలు, తిరుమల నియామావళితోపాటు, సాంప్రదాయాలపై సైతం మంత్రి నీచంగా మాట్లాడని వారు మండిపడ్డారు. టీటీడీ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం కాదని … స్వయం ప్రతిపత్తి గల్గిన దేవాలయమని వివరించారు. స్యయంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం తోపాటు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలు సైతం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశించే వారని గుర్తు చేశారు.

ఇక బీజేపీ నేతలు మంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర మతాల గౌరవాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి మంత్రి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి వర్గంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎం భాద్యత తీసుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇక అన్యమతస్తులు ఎవరు ఆలయాన్ని సందర్శించాలన్నా డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.