News

తెనాలిలో ఆర్ఎస్ఎస్ పథ సంచలనం

345views

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్వయం సేవకుల పథ పథ సంచలనం కార్యక్రమం గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. పూర్ణ గణవేష్‌తో ఆదివారం నాడు ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు భగవాధ్వజం వెంట,ఘోష్‌కు అనుగుణంగా అడుగులు కలుపుతూ ముందుకు సాగడం చూపరులను ఆకట్టుకుంది.


స్వయం సేవకులు వారి 14 రోజుల ప్రథమ వర్ష వ్యక్తిత్వ వికాస శిక్షణ లో భాగంగా జరిగిన శారీరక్ ప్రదర్శన..పట్టణ వీధుల గుండా సాగిన కవాతును ప్రజలంతా స్వయం సేవకుల మీద పూలు చల్లుతూ వారిని ఉత్సాహపరుస్తూ భగవాధ్వజానికి గౌరవవందనం సమర్పించారు.

300 మంది స్వయం సేవకులు పాల్గొన్న పథ సంచలన్ కార్యక్రమాన్ని ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల్ నాయుడు ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య గారు పర్యవేక్షించగా నగర కార్యవాహ్ శ్రీ త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్ నిర్వహించారు