
జమ్ముకశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటి పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని అన్నారు. ఇది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడి వ్యవహారాలను కేంద్రం నేరుగా పర్యవేక్షిస్తుంది. “రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. దీనికోసం ఇక్కడి యంత్రాంగం, పౌరులు అంతా సహకరించాలి” అని ఆయన కోరారు.
జమ్ముకశ్మీర్లో తల్వారా ప్రాంతంలో 14వ బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులంతా తమ కర్తవ్య నిర్వహణ కోసం సిద్ధం కావాలని, రాబోయే ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ముర్ము వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





