News

దీర్ఘకాలిక రుగ్మతలకు ఆయుర్వేదంతో మంచి ఫలితాలు

248views

దీర్ఘకాలికంగా ఉన్న పలు రుగ్మతలకు ఆయుర్వేదంతో మంచి ఫలితాలు ఉంటాయని బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లంనాయుడువలస గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పలు అనారోగ్య లక్షణాలు, సమస్యలతో శిబిరానికి వచ్చిన గ్రామస్తులకు ఆరోగ్య తనిఖీలు చేపట్టి, రోగులతో మాట్లాడి వారి సమస్యలను స్పష్టంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా వాత వ్యాధులు, జీర్ణ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ రుగ్మతలు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు, వేసవిలో ప్రబలే సమస్యలకు ఆయుర్వేద మందులను అందజేశారు. నివాస పరిసరాల్లో అనేక ఆయుర్వేద ఔషద గుణాలున్న మొక్కలు ఉన్నాయని ప్రాచీన కాలం నుండి మన ఆయుర్వేద వైద్య విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న పలు రుగ్మతలకు ఆయుర్వేదంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అవగాహన కల్పించారు.