
291views
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్‌లో సైనిక కంటోన్మెంట్లు, వైమానిక ఎయిర్ బేస్‌ల సమాచారం, చిత్రాలు పాక్‌కు చేరవేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద పాలక్ షేర్ మాసి, సూరజ్ మాసి అనే ఇద్దరు వ్యక్తులను అమృత్‌సర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో వారికి సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు ద్వారా వీరు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుసుకున్నారు.





