
హిందూ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ‘లవ్ జీహాద్’ అకృత్యాలపై భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘లవ్ జీహాద్’ నిందితులకు సంతానోత్పత్తి కలుగకుండా శస్త్ర చికిత్స-స్టెరిలైజ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
లవ్ జీహాద్‌లో పట్టుబడిన వ్యక్తులకు స్టెరిలైజ్ చేయాలని భోపాల్ మాజీ మేయర్, తొలిసారి ఎంపీగా ఎన్నికైన అలోక్ శర్మ అన్నారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా తనకు నేరుగా ఫోను చేయాలని, అవసరమైతే తక్షణం పోలీసు స్టేషన్ల చుట్టుముట్టాలని సూచించారు. లవ్ జీహాద్ పేరుతో అకృత్యాలకు పాల్పడుతున్న వారు గతంలో ఎన్నడూ చూడనంత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సమాజం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. లవ్ జీహాద్ పేరుతో ఒక గ్యాంగ్ హిందూ అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుంటున్నట్టు ఇటీవల పలు కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎంపీ తాజా వ్యాఖ్యలు చేశారు.
హిందూ అమ్మాయిలతో స్నేహం చేయడం, ఆ తర్వాత అసభ్య వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయడం, కొంత మంది అమ్మాయిలను మతం మారాలంటూ ఒత్తిడి తీసుకురావడం ఈ గ్యాంగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తరహా కేసులు భోపాల్‌లో పెరుగుతుండటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని-సిట్ సిటీ పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేశారు.





