
334views
వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో శ్రీవారి సేవకుల సాయంతో తిరుమల లడ్డూలను ప్యాకింగ్ చేయించింది. డిప్యూటీ ఈవో (జనరల్) శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.





