
289views
వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని సెక్షన్ 1లో ఉన్న సబ్ సెక్షన్ 2ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరించి.. 2025 ఏప్రిల్ 8వ తేదీని చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటిస్తున్నాం’ అని ఆ నోటిఫికేషన్‌లో ఉంది.
వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను ఈ నెల 15వ తేదీన సుప్రీంకోర్టు విచారించే అవకాశముంది. మరోవైపు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఎటువంటి ఆదేశాలైనా ఇచ్చేముందు తమ వాదనలను వినాలని కోరింది. హైకోర్టుల్లోనూ కేంద్రం కేవియట్‌లను వేసింది.





