
494views
యూపీలోని షాజహాన్ పూర్ జిల్లాలో ఖురాన్ పేజీలను చింపేసిన నజీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి ఖురాన్ పేజీలను చింపేసి గాల్లోకి విసిరేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు వీడియోలు దొరికాయని పోలీసులు తెలిపారు. నజీమ్ జలాలాబాద్ నివాసి అని తెలిపారు. ఈ ఘటన జరగగానే అధిక సంఖ్యలో ఆ ఘటనా స్థలంలో గుమిగూడారు.
పోలీసులకు కూడా సమాచారం అందడంతో అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. వెంటనే సీసీ టీవీలను పరిశీలించి, నిందితుడ్ని గుర్తించారు. జలాలాబాద్ లోని తహశీల్ రోడ్డులో ఈ ఘటన జరిగిందని, తాము వెంటనే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఎస్పీ తెలిపారు. అయితే నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెప్పారని, అయినా తాము అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
#khuran pages #uttarpradesh #muslim man





