
అత్యంత ప్రాచీన విశిష్టత ఉన్న కడప ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ఎస్. సవితలు సంయుక్తంగా పేర్కొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు





