News

పదవుల కోసం కొట్టుకున్న పాస్టర్లు

330views

విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లిలో ఉన్న సీఎస్‌ఐ చర్చిలో రెండు వర్గాలకు చెందిన పాస్టర్లు పదవుల కోసం కొట్లాడుకున్న ఘటన చోటు చేసుకుంది. కొత్తూరు తాడేపల్లిలో సీఐఎస్‌ చర్చి కమిటీ పదవీ కాలం జనవరితో ముగిసింది. కొత్త కమిటీని ఎన్నుకునేందుకు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రత్యర్థి వర్గం డిమాండ్‌ చేస్తోంది. చర్చి కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన నలుగురు గాయపడ్డారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.