News

పాక్‌లో విస్తృతంగా మైనారిటీలపై దాడులు: జైశంకర్‌

393views

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాక్‌లో మైనారిటీలపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ వాటిని నిశితంగా పరిశీలిస్తోందని.. ఆ దాడులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌లో హిందువులు సహా ఇతర మైనారిటీలపై జరిగిన తాజా దురాగతాల గురించి పేర్కొంటూ.. 2025 ఫిబ్రవరిలో హిందువులపై 10, సిక్కులపై 3 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇతర మైనారిటీల పైనా కేసులు ఉన్నట్లు తెలియజేశారు. అక్కడి హిందువులను బలవంతంగా మతం మార్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కేసులను అంతర్జాతీయ స్థాయిలో పరిశీలిస్తామన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని ఐక్యరాజ్య సమితిలోని భారత ప్రతినిధులు లేవనెత్తారని అన్నారు. ఈ చర్యలతో ఆ దేశం ప్రజాస్వామ్య, మానవ హక్కుల విలువలను ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారని తెలిపారు.