News

పాఠ్యాంశాలలో టిప్పూ సుల్తాన్ జీవిత చరిత్ర తొలగింపు?

580views

18వ శతాబ్దంలో మైసూరును పరిపాలించిన టిప్పు సుల్తాన్‌ జీవితాన్ని కర్ణాటక ప్రభుత్వం పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేర్చింది. అయితే ఇప్పుడు ఆ పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి తొలగించాలనుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ… వివాదాస్పద పాలకుడైన టిప్పు.. బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందువులను వేధించడం వంటి చర్యలను ప్రోత్సాహించేవారని పేర్కొన్నారు. అందుకే ఆయన జయంతిని కూడా ప్రభుత్వం తరఫున చేసేది లేదన్నారు. అందుకే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు యడియూరప్ప తెలిపారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం టిప్పును స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడడం దురదృష్టకరమన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పాఠ్య పుస్తకాలలో టిప్పు జీవిత చరిత్రను కొనసాగించాలని వారు పట్టుబడుతున్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.