News

సుప్రీం తీర్పును గౌరవిద్దాం – ఆర్ ఎస్ ఎస్

752views

రామజన్మ భూమి తీర్పు విషయంలోనూ, హరిద్వార్ లో జరగాల్సిన ప్రచారకుల వర్గ వాయిదా పడిందన్న విషయాన్ని వివరిస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటన యదాతథంగా….

“రాగల కొన్ని రోజుల్లో శ్రీ రామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోచ్చ న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉన్నా అందరూ దానిని అంగీకరించాలి. తీర్పు వెలువడిన తరువాత కూడా దేశంలో శాంతియుతమైన వాతావరణం కొనసాగే విధంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు హరిద్వార్ లో జరగవలసిన ప్రచారకుల వర్గ అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. అయితే ప్రచారకుల సమావేశం మాత్రం హరిద్వార్ కు బదులు ఢిల్లీలో జరుగుతుంది.” – అరుణ్ కుమార్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.