
ఢిల్లీలోని బ్రహ్మపురి ప్రాంతంలో ఉద్రిక్తత రేగింది. 12 వ లేన్ లో మసీదు అక్రమ విస్తరణ నేపథ్యంలో ఈ వివాదం రేగింది. మూడు రోజుల క్రితం తమపై రాళ్లదాడులు జరిగాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ ఇస్లామిక్ మత ఛాందసుల గొడవలతో హిందువులకు స్థానికంగా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మసీదు నుంచి కేవలం 10 అడుగుల దూరంలోనే వుండే శివాలయం సమీపంలో అనేక హిందూ కుటుంబాలు నివాసం వుంటున్నాయి. అందులో చాలా మంది హిందువులు భయపడి, ‘‘అమ్మకానికి ఇల్లు’’ అని బోర్డులే తగిలించేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అల్ మతిన్ మసీదు కి సమీపంలో వుండే అనేక హిందూ కుటుంబాలు తీవ్ర భయం గుప్పిట్లో వున్నాయి. స్థానిక ముస్లింలు అల్లర్లు సృష్టిస్తున్నారని, ఇళ్లు ఖాళీ చేయాలని తమపై తీవ్ర ఒత్తిళ్లు కూడా తెస్తున్నారని వెల్లడిస్తున్నారు.
ఈ సందర్భంగా రాధా అనే హిందూ మహిళ గతంలో జరిగిన అల్లర్లను గుర్తు చేసుకున్నారు. అల్లర్లు రేగినప్పుడు తన కోడలు గర్భవతి అని, ఎప్పుడూ భయంతో జీవించామని అన్నారు. మసీదు విస్తరణ సమస్య చాలా చిన్నదన్న కోణంలో కొందరు వున్నారని, కానీ ఇది భయంకరమైన సమస్య అని అన్నారు. ఉద్రిక్తతలు రేగుతాయని, తమ ఇళ్లను అమ్మేసి, వెళ్లిపోవడమే నయం అని అనిపిస్తోందన్నారు.
ఇక.. మరో వ్యక్తి పండిట్ శంకర్ కూడా ఆందోళనే వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వుంటున్నామని కానీ.. ఇబ్బందులను కొనితెచ్చుకోవద్దనే అనుకుంటున్నామన్నారు. దారులు ఇప్పుడే ఇరుకుగా వున్నాయని, మసీదు విస్తరణే జరిగితే… ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్నారు. దాదాపు ఇలాంటి ఆందోళనలే అందరూ వ్యక్తం చేస్తున్నారు.
మసీదు విస్తరణ నిర్మాణ పనులు మొదట్లో 2023 లో ప్రారంభమయ్యాయి. కానీ స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఆగిపోయాయి. కానీ 2024 నవంబర్ లో ముస్లింలు మున్సిపల్ నుంచి అనుమతులు పొందారు. ఫిబ్రవరి 2025 లో విస్తరణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికులు మళ్లీ ఫిర్యాదు చేశారు. అయితే.. అనుమతులు పొందారని పోలీసులు పేర్కొన్నారు. అయితే… దీనిని స్థానికులు మాత్రం వ్యతిరేకిస్తూనే వున్నారు.
అయితే ముస్లింలు మాత్రం మంకు పట్టుతో వున్నారు. తాము మసీదును వదులుకోమన్నారు. పరిస్థితులు, భయాందోళనలు చల్లబడిన తర్వాత నిర్మాణ పనులు కచ్చితంగా చేస్తామని ఇమామ్ సద్దాం హుస్సేన్ ప్రకటించాడు.ఇప్పుడు కాస్త అటు ఇటూగా వున్నా… మాకు అనుకూల వాతావరణం రాగానే మసీదు విస్తరణ చేసేస్తామంటూ ముస్లింలు ఏకపక్షంగా ప్రకటిస్తున్నారు. ఈ ముస్లింల వైఖరే స్థానిక హిందువులను మరింత భయపెట్టిస్తోంది. ఏనాటికైనా గొడవలు జరుగుతాయని హిందువులు భయపడుతున్నారు.





