News

గుప్త నిధుల కోసం ఆలయం ధ్వంసం

229views

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండలో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. కోట వద్ద, పాత చెరువు తూము వద్ద తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. కర్ణాటక నుంచి ఓ ముఠా వచ్చి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించినట్లు సమాచారం. ఇందుకు స్థానికంగా కొందరు సహకరించినట్లుగా వదంతులున్నాయి. రాజులు ఏలిన ప్రాంతం కావడం… పురాతన ఆలయాలు ఉండటంతో గతంలో పెద్ద ఎత్తున గుప్త నిధులు వెలికి తీసి, గుట్టు చప్పుడు కాకుండా అపహరించారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటికోసం ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పాత తూము వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా అటుగా స్థానికులు వెళ్లడంతో దుండగులు పరారైనట్లుగా తెలుస్తోంది.