News

ప్రకృతి పరిరక్షణ భారత సంస్కృతిలో భాగం

366views

విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించేదుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారితో సంభాషించే ‘పరీక్షా పే చర్చ’ 8వ సంచిక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రధానమంత్రిని వాతావరణ మార్పులపై ప్రశ్నను అడగగా.. ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ… పర్యావరణ పరిరక్షణ కోసం మిషన్ లైఫ్ -పర్యావరణహిత జీవనశైలి కార్యక్రమాన్ని అమలుచేస్తన్నామని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ భారత సంస్కృతిలో భాగమని ప్రధానమంత్రి పేర్కొన్నారు