News

మౌనీ అమావాస్యకు 150 ప్రత్యేక రైళ్లు

251views

మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 29న మహాకుంభ మేళాకు పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే డివిజను ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని తొమ్మిది స్టేషన్ల నుంచి అన్ని దిక్కులకు ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం కలర్‌ కోడ్‌తో రైల్వే టికెట్లు, వసతి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయనున్నారు. రోజువారీగా నడిచే రైళ్లతోపాటు అదనంగా 150 ప్రత్యేక రైళ్లను ఒకేరోజు నడపడం అసాధారణ విషయమని ప్రయాగ్‌రాజ్‌ రైల్వే డివిజను పీఆర్వో అమిత్‌ మాలవీయ తెలిపారు. మౌనీ అమావాస్య నాడు 10 కోట్లమందికి పైగా భక్తులు త్రివేణీసంగమంలో పుణ్యస్నానాలు చేయవచ్చని మేళా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.