News

‘బాబ్రీ మసీదులాంటిది బెంగాల్లో కట్టిస్తున్నా!’

283views

టీఎంసీ నేత, ముఖ్యమంత్రి, వీర సెక్యులరిస్టు మమతా బెనర్జీ పూరీ తరహా ఆలయాన్ని రాష్ట్రంలో నిర్మిస్తుంటే అక్కడి మైనారిటీ నాయకులు మిన్నకుంటారా? వారు టీఎంసీ వారే అయినా మౌన ప్రేక్షక పాత్రకు పరిమితం కారు. కాబోరు. చూడండి! టీఎంసీ ఎమ్మెల్యే ప్రజలకి చిత్రమైన హామీ ఇచ్చాడు. అతడి పేరు హుమాయూన్ కబీర్, 2025 కల్లా ముర్షీదాబాద్లో లో అచ్చం బాబ్రీమసీదును పోలిన మసీదును తాను నిర్మిస్తానని డిసెంబర్ 12న ప్రకటించాడు. దీనితో అటు బీజేపీయే కాకుండా కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యే ప్రకటన మీద మండి పడ్డాయి. అయితే టీఎంసీ మాత్రం ఆ మసీదు, ఆ కట్టడం అంతా ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. అసలు ఇలాంటివే సంచలన ప్రకటనలు ఇస్తూ నిత్యం పత్రికల శీర్షికలలో కనిపించడం ఈ కబీరుకి అలవాటేనట. చూడండి అలాంటి ఒక మసీదు నిర్మాణాన్ని మీరే చూస్తారు. అందుకు మీరే సాక్షి అని మీడియాకు చెప్పాడాయన. ఆ మసీదు రాష్ట్రంలో ఉన్న 34 శాతం ముస్లింల ఆకాంక్షలకు తగినట్టు ఉంటుందని భరత్పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కబీర్ చెప్పారు. బెలదంగా అనేచోట ఆ మసీదును మీరంతా చూస్తారని కూడా చెప్పాడు. ఆ కబీర్ ప్రకటన పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నదని మాత్రం అనుకోవద్దు అని మరొక టీఎంసీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అయితే తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా, తాను చేస్తున్నది మాత్రం వారసత్వపు సంపద గురించి చెప్పడమేనని కబీర్ సమర్ధించుకుంటున్నాడు.