
పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంభమేళా ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పరిశీలించారు. కుంభమేళా ఘాట్లను యోగి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్ హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు యోగి.. సంగం నోజ్ ఘాట్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర హారతి ఇచ్చారు.
ప్రయాగ్‌రాజ్‌లో బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను యోగి ప్రారంభించారు. ఏర్పాట్లపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత 25 రోజుల్లో యోగి ప్రయాగ్‌రాజ్‌కు రావడం ఇది ఐదోసారి.. 6 లేన్ల బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. కుంభమేళా వేదిక డ్రోన్ దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. . జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతోంది. దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించే అవకాశం ఉంది. ఫిభ్రవరి 26వ తేదీ వరకూ ప్రయాగర్‌రాజ్ కుంభమేళా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నాగసాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు





