News

హైందవ శంఖారావం ర్యాలీ

285views

హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలాఆనంద్ పిలుపునిచ్చారు.ఈరోజు ఆయన బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, హైందవ శంఖారావాన్ని పురస్కరించుకొని జనవరి 2వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో హిందువులంతా ఏకమై రావాలని అన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రత్తిపత్తి కల్పించాలన్న డిమాండ్‌తో జనవరి 5న విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయడానికి ముందస్తుగా జనవరి 2వ తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించే భారీ ర్యాలీకి నియోజకవర్గం లోని హిందువులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.