News

బంజార జనసంఘ్ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

225views

అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బంజార జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు హరిచౌహాన్ నాయక్. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో బంజార జనసంఘ్ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హరి చౌహాన్ నాయక్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎంతో గొప్పవన్నారు. వాటిని భావితరాలకు అందించడమే కాకుండా మనం కూడా గుర్తించుకుని తప్పనిసరిగా పాటించాలన్నారు.